కొత్త లుక్స్ లో కనిపించబోతున్న మెగాస్టార్

మెగా స్టార్ చిరంజీవి 150వ సినిమా ‘కత్తిలాంటోడు’ జూన్ మొదటి వారంలో షూటింగ్ ప్రారంభం అవుతుంది అని ఎదురు చూస్తున్న చిరంజీవి అభిమానులను నిరాశ పరిచే ఒక షాకింగ్ రూమర్ ఫిలిం నగర్ లో లేటెస్ట్ గా హడావిడి చేస్తోంది. ఈ సినిమా కోసం చిరంజీవి తన లుక్ ను పూర్తిగా మార్చుకున్నా మరో 5 కేజీలు బరువు తగ్గితే బాగుంటుంది అని దర్శకుడు వినాయక్ చిరంజీవికి ఇచ్చిన సూచనతో మరోసారి ఈసినిమా షూటింగ్ వాయిదా పడుతుంది అన్న వార్తలు వస్తున్నాయి. ఠాగూర్ సినిమాలో చిరంజీవి ఎలా కనిపించాడో అటువంటి లుక్ తనకు కావాలి అని వినాయక్ చిరంజీవిని కోరుతున్నట్లు టాక్. అయితే చిరంజీవి ఎంత ప్రయత్నించినా వెయిట్ విషయంలో వినాయక్ కోరిన విధంగా తయారు కావడానికి చిరంజీవి లుక్ పూర్తిగా మారక పోవడంతో మరోసారి ఈసినిమా షూటింగ్ వాయిదా పడుతోంది అని అంటున్నారు.8   kotta looks lo kanipinchabotunna megastar

దీనికితోడు హీరోయిన్ విషయంలో కూడ ఈసినిమాకు తలెత్తుతున్న సమస్యలు వినాయక్ ను టెన్షన్ లో పడేస్తోంది అని టాక్. ఇది ఇలా ఉండగా రెమ్యూనరేషన్ చాలలేదని ఒక హీరోయిన్, చిరంజీవి‌తో చేయాలంటే నా కెపాసిటీ చాలదంటూ మరో హీరోయిన్ తప్పించుకోవడం కూడా ‘కత్తిలాంటోడు’ కి కొద్దిగా ఇబ్బందిగా ఉన్నట్టు సమాచారం. ఇది చాలదు అన్నట్లుగా ఈ వయసులో యంగ్ హీరోలతో పోటీపడి డ్యాన్సులు ఫైట్స్ చేస్తే ఆడియన్స్ అంగీకరిస్తారా? అనే విషయంలో చిరంజీవికి రకరకాల ఆలోచనలు వెంటాడుతున్నట్లు వార్తలు వస్తున్నాయి. చిరంజీవి ప్రతిష్టాత్మకంగా చేస్తున్న ‘కత్తిలాంటోడు’ పై విపరీతమైన భారీ అంచనాలు ఉండటంతో ఈమధ్యనే అలా విపరీతమైన హైక్ లోకి వెళ్లి సూపర్ ప్లాప్ గా మారిన ‘బ్రహ్మోత్సవం’ కళ్ళముందు కనిపిస్తుండటంతో చిరు కొత్త సినిమా స్పీడు తగ్గిందంటున్నారు. దీనితో ఇప్పటికే తయారు అయిన ఈ సినిమా స్క్రిప్ట్ లో మళ్ళీ మార్పులు చేర్పులతో పాటు హీరోయిన్ సమస్య ఇలా ఎన్నో కారణాలు చిరంజీవిని తన 150వ సినిమా విషయంలో అయోమయంలో పడేస్తున్నట్లు తెలుస్తోంది.

179 total views, 1 views today

About siteadmin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

*

error: Content is protected !!