మెగా ఫ్యాన్స్ ని కరుణించిన రామ్ చరణ్ తేజ్

బ్రూస్ లీ సినిమా విడుదలయ్యాక ప్రకటించారు , తమిళ సినిమా తని ఒరువన్ ని రామ్ చరణ్ రిమేక్ చేస్తున్నట్లు. ఆ సినిమా విడుదలయ్యి ఏడు నెలలు దాటాయి . కాని ఇంతవరకు రామ్ చరణ్ ముఖానికి మేకప్ వేసుకోలేదు . అప్పుడు అని , ఇప్పుడు అని , ఫిబ్రవరిలో ముహూర్థమైతే పెట్టారు కాని , సినిమా షూటింగ్ ని గాలికి వదిలేసారు . ఇంత ఆలస్యం అవడానికి చరణే కారణం అని యూనిట్ మాట . విలన్ పాత్ర పోషిస్తున్న అరవింద స్వామీ , నిర్మాత అల్లు అరవింద్ కూడా రామ్ చరణ్ వ్యవహారంపై అసంతృప్తి వ్యక్తం చేసారు .6 mega fans ni karuninchina ram charan tej

ఇక మెగా ఫ్యాన్స్ సంగతి చెప్పనక్కరలేదు. చరణ్ ని వ్యక్తిగతంగా కలిసి , సినిమా త్వరగా మొదలుపెట్టమని చెప్పారట మెగా సీనియర్ ఫ్యాన్స్ . ఇంతమందిని ఇన్నిరోజులు ఇలా కష్టపెట్టిన రామ్ చరణ్ , మొత్తానికి కరుణించాడు . జూన్ 6 నుంచి చరణ్ షూట్ కి వస్తాడట . దసరాకి ఈ సినిమా ఖాయంగా విడుదల అయ్యేలా కష్టపడతాడట . చూద్దాం ఈసారి ఏం చేస్తాడో . మెన్నటి వరకు కూడా అందరు ఈ సినిమా ఇప్పట్లో రాదు అనుకున్నారు. కానీ ఇప్పుడు రామ్ చరణ్ తీసుకున్నా నిర్ణయానికి చిత్రయూనిట్ చాలా సంతోషపడుతోంది అని సమాచారం. అయితే ఇక్కడ అసలు రామ్ చరణ్ మాత్రం ఒక ప్రక్క చిరు 150 సినిమా అలాగే ఎయిర్ వేయ్స్ బిజినెస్ లో బీజి బీజి గా ఉండటం వలనే షూటింగ్ రామ్ చరణ్ కి కష్టమవుతోంది అని అతని సన్నిహితులు చెబుతున్నారు. సురేందర్ రెడ్డి దర్శకత్వం వహించనున్న ఈ రిమీక్ చిత్రంలో రకుల్ ప్రీత్ కథానాయిక . తమిళ చిత్రానికి సంగీతం సమకూర్చిన హిప్ హాప్ తమిజా , తెలుగు చిత్రానికి కూడా బాణీలు అందిస్తున్నాడు . ప్రస్తుతానికైతే ధృవ అనే టైటిల్ ఫిక్స్ చేసుకుంది యూనిట్ .

 

693 total views, 1 views today

About siteadmin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

*

error: Content is protected !!