రామ్ చరణ్ ధృవ మూవీ బ్లాక్ బస్టర్ కావడం ఖాయం

మగధీర సినిమా తరవాత రామ్ చరణ్ సరైన రికార్డు ఒక్కటి కూడా కొట్టలేక పోయాడు. ఒక పక్క అతని బావ , మెగా హీరో బన్నీ దూసుకుపోతూ ఉండగా మనోడు మాత్రం చాలా పేలవమైన రికార్డులు సొంతం చేసుకుంటున్నాడు. హిట్టు సినిమా సరైనది ఒక్కటి కూడా పడ్డం లేదు. కాస్త సంతొషించ దగ్గ విషయం ఏంటంటే రామ్ చరణ్ ప్రతీ సినిమా నలభై కోట్లు రీచ్ అవుతుంది అది కాస్త యావరేజ్ అయినా హిట్ అయినా కూడా. మొన్నటికి మొన్న సరైనోడు సినిమాతో బన్నీ మగధీర ని తలదన్నేసాడు కూడా. ప్రస్తుతం ధృవ సినిమా షూటింగ్ లో ఉన్న రామ్ చరణ్ ఒక తాజా ప్రెస్ నోట్ ని వదిలాడు. విదేశాల్లో అతనికి ఉన్న ఫాలోయింగ్ వీరలెవల్లో ఉంది అంటూ అందులో పేర్కొనడం విశేషం. జపాన్ , అరబీస్ , ఈస్ట్ ఆశియన్ దేశాలలో రామ్ చరణ్ కి భారీ ఫాన్ ఫాలోయింగ్ ఉంది అంటూ ఆ ప్రెస్ నోట్ లో ప్రత్యేకంగా పేర్కొనడం విశేషం.3   ramcharan druva movie blak buster kavadam khayam

అతనికి ఫాన్ ఫాలోయింగ్ సంగతి పక్కన పెడితే రికార్డులు కూడా లేవు ఆయా ప్రాంతాలలో. పాత రికార్డులు ఉన్నవి పగలగొట్టి కొత్తవి సృష్టిస్తేనే సూపర్ స్టార్ అనిపించుకుంటాడు. అలాంటివి చరణ్ మగధీర తరవాత చెయ్యనే లేదు. మగధీర వచ్చి దాదాపు పదేళ్ళు దాటిపోతోంది ఇప్పటి వరకూ ఆ రకంగా ఒక్క అడుగు కూడా ముందరకి పడనే లేదు. ఈ పరిస్థితి లో చరణ్ నుంచి , ప్రొడ్యూసర్ ల నుంచీ ఆ రకమైన ప్రెస్ నోట్ లు అవసరమా అని ఫాన్స్ ప్రశ్నిస్తున్నారు. అవతల వేరే ఫాన్స్ సెటైర్ లు వేసుకోవడానికి కాకపోతే ఈ హడావిడి ఎందుకు సినిమా గురించి మాట్లాడ్డం మానేసి అనేది వారి కోపం . ప్రస్తుతం ధృవ షూటింగ్ కాశ్మీర్ లో పూర్తి అయ్యింది, అవుట్ పుట్ బాగుంది అనే టాక్ వినిపిస్తోంది. ఈ సినిమా తమిళ చిత్రం తనీ ఒరువన్ కి రీమేక్ కాగా సురేందర్ రెడ్డి డైరెక్షన్ లో రకుల్ హీరోయిన్ గా వస్తోంది. ఈ సినిమా బ్లాక్ బస్టర్ అవ్వాలి అని అందరూ కోరుకుంటున్నారు. చరణ్ కి చాన్నాళ్ళ తర్వాత ఓవర్ సీస్ లో కూడా క్రేజ్ ని తెచ్చిపెట్టే సినిమా ఇది అవ్వచ్చు. ఆద్యంతం క్లాస్ గా సాగే ఈ సినిమా పెర్ఫెక్ట్ కథాంశం తో రూపొందింది. అంతా బాగున్నా ఈ ప్రెస్ నోట్ మాత్రం యాంటీ ఫాన్స్ కి నవ్వు తెప్పించే విధంగా ఉంది అని ఫాన్స్ కోప్పడుతున్నారు.

516 total views, 1 views today

About siteadmin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

*

error: Content is protected !!