తమిళ్ లో రిలీస్ అవుతున్న బాబు బంగారం

ప్రేమ కథల దర్శకుడు మారుతి తాజాగా తెరకెక్కిస్తున్న చిత్రం ‘బాబు బంగారం’. ఈ చిత్రంలో వెంకటేష్‌ హీరోగా నయనతార హీరోయిన్‌గా నటించారు. షూటింగ్‌ కార్యక్రమాలు మొత్తం పూర్తి చేసుకుని ఈ చిత్రం అగష్టు 12న విడుదల కావడానికి సిధ్దంగా ఉంది. కాగా ఈ చిత్రంపై వెంకటేష్‌ అభిమానులు బాగా ఆసక్తి చూపుతున్నారు. గతంలో వెంకటేష్‌ మరియు నయనతారలు నటించిన ‘లక్ష్మి’, ‘తులసి’ రెండు చిత్రాలు కూడా సూపర్‌ సక్సెస్‌ను సాధించాయిvvv

దాంతో ఈ హిట్‌ జంట మరోసారి జంట కట్టడంతో ఈ చిత్రంపై కూడా ప్రేక్షకులకు బాగా ఆసక్తి నెలకొంది. తమిళ నాడులో నయన్‌కు గల క్రేజ్‌ను చెప్పనక్కర్లేదు. అయితే ఈ చిత్రం తమిళంలో కూడా మంచి విజయం సాధిస్తుంది అని తమిళంలోకి డబ్బింగ్‌ చేస్తున్నారు. ఇక్కడ ఈ చిత్రానికి ఆదరణ అంతగా లభించకున్న తమిళంలో మాత్రం నయనతార ఇమేజ్‌ వల్లనైనా ఈ చిత్రాన్ని ప్రేక్షకులు ఆదరిస్తారు అని కావచ్చు అక్కడ కూడా విడుదల చేయాలని చిత్ర యూనిట్‌ ప్లాన్‌ చేస్తున్నారు.

అయితే తెలుగులో అగష్టు 12న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది. తమిళంలో ఎప్పుడు అనేది ఇంకా కన్పర్మ్‌ కాలేదు. ఇప్పటికే విడుదలైన ట్రైలర్‌ ప్రేక్షకుల్లో భారీ అంచనాలను రేకెత్తిస్తోంది. మరి ఈ చిత్రం ఎలా ఉంటుందో, ఈ హిట్‌ జంట మరోసారి సక్సెస్‌ను సాధిస్తారా చూడాలి.

221 total views, 1 views today

About siteadmin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

*

error: Content is protected !!