ఎన్టీఆర్ ఫాన్స్ కి గుడ్ న్యూస్, కొరటాల శివ మళ్ళీ మేజిక్ రిపీట్ చేస్తున్నాడు

యంగ్ టైగర్ ఎన్టీఆర్, బ్లాక్‌బస్టర్ డైరెక్టర్ కొరటాల శివల కాంబినేషన్‌లో వచ్చిన ‘జనతా గ్యారెజ్’ సినిమా బాక్సాఫీస్ వద్ద వసూళ్ళ వర్షం కురిపిస్తోన్న విషయం తెలిసిందే. భారీ అంచనాలతో గత వారం విడుదలైన ఈ సినిమా పలుచోట్ల రికార్డు కలెక్షన్స్ సాధించి దూసుకుపోతోంది.ntr fans ki good news koratala shiva malli magic ripet chesthunnadu

ఇక ఈ నేపథ్యంలోనే ఇప్పటికే సినిమా చూసి ఉన్న అభిమానులు మళ్ళీ చూసేలా, కొత్తగా కొన్ని సన్నివేశాలను జత చేస్తున్నారు. రేపట్నుంచి అన్ని ప్రాంతాల్లో కొత్తగా జత చేసిన సన్నివేశాలతో సినిమా ప్రదర్శితం కానుంది.

దర్శకుడు కొరటాల శివ తెరకెక్కించిన ‘మిర్చి’, ‘శ్రీమంతుడు’.. ఈ రెండు సినిమాల విషయంలోనూ ఒక వారం తర్వాత కొత్త సన్నివేశాలను జత చేయడం జరిగింది. ఇప్పుడు తన మూడో సినిమాకూ కొరటాల శివ  దీన్ని మళ్ళీ రిపీట్ చేయడం విశేషంగా చెప్పుకోవచ్చు.

మైత్రీ మూవీ మేకర్స్ నిర్మించిన ఈ సినిమాలో సమంత, నిత్యా మీనన్‌లు హీరోయిన్లుగా నటించగా, మళయాల సూపర్ స్టార్ మోహన్ లాల్ ఓ ప్రధాన పాత్రలో నటించారు. ఇప్పటివరకూ ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమా సుమారు 60 కోట్ల రూపాయల షేర్ వసూలు చేసింది.

About siteadmin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

*

error: Content is protected !!