రామ్ చరణ్ రికార్డుని బ్రేక్ చేయాలి అంటే మరో 1 కోటి కావాలి

యంగ్ టైగర్ ఎన్టీఆర్ నటించిన జనతాగ్యారేజ్ బాక్స్ ఆఫీస్ 84.54 కోట్ల షేర్ కలెక్షన్స్ తో రికార్డు క్రియేట్ చేసింది. ఈ రేంజ్ సక్సెస్ కోసం 13 ఏళ్లుగా ఎదురుచూస్తున్న అభిమానుల కళలను నెరవేరుస్తూ ఇప్పుడు ఇండస్ట్రీ రికార్డులను తిరగరాశాడు ఎన్టీఆర్.ram-charan-recrod-ni-brek-cheyali-ante-maro-1-koti

కాగా ఇప్పుడు మరో బిగ్గెస్ట్ అచీవ్ మెంట్ కి చేరువ కాబోతున్నాడు యంగ్ టైగర్ ఎన్టీఆర్. రెండు తెలుగు రాష్ట్రాల్లో 100 కోట్ల గ్రాస్ అందుకోబోతున్న రెండో సినిమాగా జనతాగ్యారేజ్ చరిత్ర పుటల్లో నిలవడానికి సిద్ధం అవుతుంది.

బాహుబలి 160 కోట్ల తరువాత అక్కడ హైయెస్ట్ కలెక్షన్స్ సాధించిన సినిమా మగధీర 98 కోట్ల గ్రాస్. ప్రస్తుతం 97 కోట్ల గ్రాస్ తో దూసుకుపోతున్న జనతాగ్యారేజ్ లాంగ్ రన్ లో మరో 1 కోటి వసూల్ చేస్తుందని అంచనా. ఇక ఓవర్ ఫ్లో కలెక్షన్స్ ని కూడా కలుపుకుంటే 100 కోట్ల గ్రాస్ అందుకోవడం ఖాయం అంటున్నారు.  

 

2,668 total views, 1 views today

About siteadmin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

*

error: Content is protected !!