ధృవ సినిమా పై ట్రేడ్ పండితులు షాకింగ్ కామెంట్

మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ నటించిన లేటెస్ట్ మూవీ ధృవ బాక్స్ ఆఫీస్ దగ్గర రిలీజ్ అయ్యి ఫస్ట్ వీక్ 41.50 కోట్ల దాకా షేర్ వసూల్ చేసింది. కాగా సినిమాను అనుకున్న టైంలో విడుదల చేసి ఉంటే కలెక్షన్స్ మరో విధంగా ఉండేవని ట్రేడ్ పండితులు అంటున్నారు.

వారిలెక్కల ప్రకారం సినిమా దసరా నాటికే సిద్ధం అయ్యి ఉండగా జనతాగ్యారేజ్ వచ్చిన నెల రోజులకే రావడం ఇష్టం లేక దసరాని టోటల్ గా అవైడ్ చేశారు. కనీసం దీపావళి సమయంలో రిలీజ్ చేసిన సినిమా హిస్టారికల్ వసూళ్లు సాధించేది అని ట్రేడ్ పండితులు చెబుతున్నారు.

కానీ మంచి సెలవులను వదిలేసి డిసెంబర్ సమయంలో పెద్దగా పోటి లేదని ఎక్కువ వర్కింగ్ డేస్ ఉన్నా డేర్ చేసి రిలీజ్ చేయాలి అనుకున్న సమయంలో ఈ డీమానిటైజేషన్ పెద్ద ఎదురుదెబ్బగా నిలిచిందని చెబుతున్నారు.

అదే ధృవ కనుక దసరాకో దీపావళికి రిలీజ్ అయ్యి ఉంటే కచ్చితంగా 80 కోట్లకు తక్కువ కాని కలెక్షన్స్ ని రాబట్టేదని అంటున్నారు. మరి వీళ్ళ మాటని మీరు ఏకీభవిస్తారా కింద కమెంట్ సెక్షన్ లో చెప్పండి.

1,827 total views, 1 views today

About siteadmin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

*

error: Content is protected !!