ధృవ రిలీజ్ చేసి 9 రోజులు అవుతున్న కొన్ని ఏరియాలలో బ్లాక్ టికెట్స్ భారీగా అమ్ముడుపోతున్నాయి ఎంతో తెలుసా..?

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ రెండు సంవత్సరలగా అందకుండా ఊరిస్తున్న విజయం ఎట్టకేలకు ధృవ రూపంలో అందింది. స్టైలిష్ మూవీ డైరెక్టర్ సురేందర్ రెడ్డి టేకింగ్, రామ్ చరణ్ నటన, హిప్ హాప్ తమిజా మ్యూజిక్, వినోద్ కెమెరా వెరసి ఓ కలర్ఫుల్ థ్రిల్లర్ ని మన కళ్ళ ముందు ఉంచారు.

ధృవ రిలీజ్ ముందువరకు మెగా అభిమానుల అంచనాలు తారా స్థాయిలో ఉన్నాయి కాని సగటు ప్రేక్షకుడు మాత్రం బాగుంటే అప్పుడు చూద్దాంలే అని వెయిట్ చేస్తూ వచ్చాడు.ధృవ సినిమా విడుదల అయ్యాక సీన్ రివర్స్ అయింది.

టికెట్స్ ఫస్ట్ డే దొరికినంత ఈజీగా ఇప్పుడు దొరకడం లేదు. కారణం మౌత్ పబ్లిసిటీ. స్టార్ హీరో అయినప్పటికీ మాస్ ఎలెమెంట్స్ తక్కువగా ఉన్న సినిమా ఎంత వరకు రిసీవ్ చేసుకుంటారో అనే అనుమానాలను పటాపంచలు చేస్తూ బ్లాక్ బస్టర్ వైపు దూసుకుపోతోంది. కొన్ని ఏరియాలలో బ్లాక్ టికెట్స్ 300 నుండి 500వరుకు అమ్ముడుపోతున్నాయి అంట.

1,576 total views, 1 views today

About siteadmin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

*

error: Content is protected !!