తమిళ్ కత్తి కన్నా ఖైదీ నెంబర్ 150 సినిమాలో 30% సీన్స్ కొత్తగా ఉంటుందిట

తమిళ బ్లాక్ బస్టర్ కత్తి ని మెగాస్టార్ చిరంజీవి తెలుగు లో ఖైదీ నెంబర్ 150 గా రీమేక్ చేస్తున్న సంగతి తెలిసిందే. ఒక వింటేజ్ లుక్ తో చిరంజీవి యంగ్ గా కనిపిస్తున్న ఈ సినిమాలో కామెడీ తో పాటు సీరియస్ సీన్ లు కూడా పెట్టారు వినాయక్.

నిజానికి తమిళ కత్తి లో అసలు కామెడీ నే ఉండదు, హీరో పక్కన ఉండే ఫ్రెండ్ అప్పుడప్పుడూ చమక్కులు వదలడం తప్ప కామెడీ కొసం అందులో స్పెషల్ ట్రాక్ లు ఏమీ లేవు. కానీ తెలుగు లో ఈ విషయం లో పెద్ద మార్పులు తీసుకుని వచ్చారు వినాయక్ .

చిరంజీవి ఫాన్స్ కామెడీ ని బాగా ఇష్టపడతారు దాని కోసం బ్రహ్మానందం తో ఒక స్పెషల్ కామెడీ ట్రాక్ రాయించి చేయించారట. స్టార్ కమెడియన్లు బ్రహ్మానందం.. పృథ్వీలతో ప్రత్యేకంగా కామెడీ ట్రాక్స్ చేయించాడు దర్శకుడు వినాయక్. ఇందులో పృథ్వీ ట్రాక్ లో చాలా వరకు కోత పడ్డప్పటికీ ఎంటర్టైన్మెంట్ ఏమీ తగ్గదట.

వినాయక్ మాటల్లో చెప్పాలంటే.. చిరంజీవి సూపర్ హిట్ ఎంటర్టైనర్స్ రౌడీ అల్లుడు.. దొంగమొగుడు సినిమాలు రెంటినీ కలిపితే ఎంత ఎంటర్టైన్మెంట్ ఉంటుందో అంతా ‘ఖైదీ నెంబర్ 150’లో ఉంటుందట. బ్రహ్మానందం.. చిరంజీవి కాంబినేషన్లో వచ్చే సన్నివేశాలు భలేగా పేలుతాయని వినాయక్ చెప్పాడు. బ్రహ్మానందాన్ని చిరంజీవి ఆటపట్టించే సన్నివేశాల్లో కామెడీ చాలా బాగా పండిందన్నాడు వినాయక్.

 

497 total views, 1 views today

About siteadmin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

*

error: Content is protected !!