చిరంజీవి,రామ్ చరణ్ పై కామెంట్ చేసిన సురేఖ

మెగాస్టార్ చిరంజీవి సతీమణి సరేఖకు ఓ ఆశ ఉండేదట. మెగాస్టార్ చిరంజీవి భార్యగా సురేఖ ఆశపడితే తీరకపోవడమా పైగా కొడుకు రామ్ చరణ్ కూడా స్టార్ హీరో. అలాంటప్పుడు సురేఖ దేని గురించి అయినా ఆశపడితే తీరకపోవడం అనే క్వశ్చన్ లేనే లేదు. అయితే ఆ ఆశ చిరంజీవి, రామ్ చరణ్ కి సంబంధించింది. అసలు తన ఆశ నెరవేరుతుందా లేదా అని కూడా ఓ సందర్భంలో సురేఖ అనుకుందట.

కానీ ఆ ఆశ నెరవేరింది. దాంతో ఆమె ఫుల్ హ్యాపీ. ఇంతకీ ఆమె అంతలా దేని గురించి ఆశ పడింది. తెలుసుకుందాం. చిరంజీవి, రామ్ చరణ్ ఇద్దరూ మేకప్ వేసుకుని ఇంటి నుంచి బయలుదేరి షూటింగ్ కి వెళితే చూడాలనేది సరేఖ ఆశ అట. అయితే రామ్ చరణ్ తొలి సినిమా ‘చిరుత’ ఆరంభం, చిరంజీవి ‘శంకరదాదా జిందాబాద్’ సినిమా షూటింగ్ పూర్తి చేసుకుని విడుదలకు సిద్ధమవ్వడం ఒకే యేడాది జరిగిపోయింది.

ఆ తర్వాత చిరంజీవి మేకప్ వేసుకోవడానికి 10 యేళ్లు పట్టింది. 2007 తర్వాత చిరంజీవి సినిమాల నుంచి బ్రేక్ తీసుకోవడం, రాజకీయాల్లోకి ఎంట్రీ ఇవ్వడంతో ఇక చిరంజీవి సినిమాలు చేయరని అందరూ ఫిక్స్ అయిపోయారు. సురేఖ కూడా ఇలాగే ఫిక్స్ అయ్యిందట. దాంతో తన ఆశ నెరవేరదని భావించిందట. కానీ చిరంజీవి మళ్లీ మేకప్ వేసుకోవడం, ‘బ్రూస్ లీ’ లో గెస్ట్ అఫియరెన్స్ ఇవ్వడం, ఆ వెంటనే 150వ సినిమాగా ‘ఖైదీ నెం.150’ చేయడం జరిగింది. రామ్ రణ్ ‘దృవ’ కోసం మేకప్ వేసుకుని బయలుదేరుతుంటే, చిరంజీవి ‘ఖైదీ నెం.150’ సినిమా షూటింగ్ లో పాల్గొనడానికి మేకప్ వేసుకునేవారట. ఇద్దరూ మేకప్ వేసుకుని ఇంటి నుంచి బయలుదేరతుంటే సురేఖకు చాలా ఆనందంగా ఉండేదట. ఇద్దరినీ చూసుకుని తెగ మురిసిపోయేదట.

 

 

480 total views, 1 views today

About siteadmin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

*

error: Content is protected !!