news

బలహీనుడి పక్కన బలముంది

బలహీనుడి పక్కన బలముంది

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం కొరటాల శివ దర్శకత్వంలో ‘జనతా గ్యారేజ్’ లో నటిస్తోన్న విషయం తెలిసిందే. ఆ మధ్య ఫస్ట్ లుక్ తో అదుర్స్ అనిపించినా తారక్, ఇక ఇప్పుడు మాత్రం టీజర్ తో సూపర్ అనిపించాడు. మొదటి నుంచి అందరూ అనుకున్నట్టు గానే అంచనాలను మించి ఈ టీజర్ ఉండేలా ప్లాన్ చేశారు కొరటాల అండ్ టీమ్. ఇక టీజర్ విషయానికి వస్తే దర్శకుడు కొరటాల శివ ఎప్పట్లానే తన బలమైన కథాంశాన్ని, అంతే బలమైన సంభాషణలతో ఓ కథగా చెప్పినట్లు టీజర్ చూస్తే స్పష్టంగా అర్థమవుతుంది. ‘బలవంతుడు బలహీనుడ్ని భయపెట్టి బతకడం ఆనవాయితీ.. బట్ ఫర్ ఏ చేంజ్, ఆ బలహీనుడి వద్ద కూడా ఓ బలముంది. జనతా గ్యారెజ్.. ఇచట అన్నీ రిపేర్ చేయబడును’ అన్న డైలాగ్‌ను 35 సెకండ్ల టీజర్‌లో తెలివిగా చెప్పుకొచ్చిన స్టైల్ బాగుంది. ఇక ఈ టీజర్‌లో ఎన్టీఆర్ చెప్పిన డైలాగ్స్ ... Read More »

బట్.. ఫర్ ఏ చేంజ్

బట్.. ఫర్ ఏ చేంజ్

యంగ్ టైగర్ ఎన్టీఆర్ నటించిన ‘జనతా గ్యారేజ్’ చిత్రం కోసం ఇప్పటికే ఫ్యాన్స్ అంతా ఎంతగానో ఎదురు చూస్తున్నారు. వారికోసమే మూవీ టీజర్ ను రంజాన్ సందర్భంగా రిలీజ్ చేశారు చిత్ర యూనిట్. బుధవారం సాయంత్రం సోషల్ మీడియా ద్వారా రిలీజ్ చేశారు మూవీ మేకర్స్. 34 సెకన్ల టీజర్‌లో పవర్ ఫుల్ డైలాగ్స్ ఉంచాడు డైరెక్టర్ కొరటాల శివ. ‘బలవంతుడు బలహీనుడ్ని భయపెట్టి బతకడం ఆనవాయితీ.. ఆ బలహీనుడి పక్కన కూడా ఓ బలముంది’ అంటూ ఎన్టీఆర్ చెప్పే డైలాగ్ ఫ్యాన్స్ ను చాలా బాగా ఆకట్టుకుంది. హీరో గెటప్ ని చూపించడంలో సక్సెస్ అయ్యాడు కొరటాల శివ. ఇకపోతే దేవీశ్రీ ప్రసాద్ మ్యూజిక్.. ఇప్పటికే తారక్ సినిమాకు అదిరిపోయే మ్యూజిక్ ఇచ్చిన దేవీ, గ్యారేజ్ విషయంలో ఒకడుగు ముందుకేశాడనే చెప్పాలి. అంటే అర్ధం అయ్యింది కదా.. ఈ టీజర్ లోని బ్యాగ్రౌండ్ మ్యూజిక్ అందరి చేత నూటికి నూరు ... Read More »

మలయాళంలోనూ రిలీజ్

మలయాళంలోనూ రిలీజ్

టాలీవుడ్ యంగ్ టైగర్ ఎన్టీఆర్ అభిమానులు ఇప్పుడు మంచి జోష్ లో ఉన్నారు. కొరటాల శివ డైరక్షన్ లో వచ్చిన జనతాగ్యారేజ్ టీజర్ మంచి టాక్ ని అందుకోవడంతో ఖుషీ ఖుషీగా ఉన్నారు. ఈ సినిమా తెలుగుతోపాటు మలయాళంలోనూ రిలీజ్ కానుండటంతో ఆ భాషలోనూ టీజర్ ని రిలీజ్ చేశారు. తెలుగు టీజర్ లో ఎన్టీఆర్ ని ఫోకస్ చేస్తే మలయాళం టీజర్ లో మోహన్ లాల్ ని హైలెట్ చేశారు. గ్యారేజ్ లో రిపేర్ చేస్తూ కనిపించే సీన్ తో టీజర్ మొదలవుతుంది. జనతాగ్యారేజ్ ఇక్కడ అన్నీ రిపేర్లు చేయబడును అంటూ మోహన్ లాల్ ఒక్క డైలాగ్ మాత్రమే ఉంటుంది. మిగిలిందంతా యాక్షన్ సీన్లే. ఎన్టీఆర్ ఫైటింగ్ సీన్లతో టీజర్ ని ఎండ్ చేశారు. ఆగస్టు 12న రిలీజ్ కు సిద్ధమవుతున్న జనతాగ్యారేజ్ సినిమా ఆడియో రిలీజ్ ఈనెల్లోనే ఉంటుందని సినీజనం గుసగుసలాడుకుంటున్నారు. 123 total views, no views today Read More »

ఈ మధ్య బాగా స్పీడు పెంచేశాడు

ఈ మధ్య బాగా స్పీడు పెంచేశాడు

టాలీవుడ్ మెగా ప్రిన్స్ వరుణ్ తేజ ఈ మధ్య బాగా స్పీడు పెంచేశాడు. నిన్నటివరకు మొహమాటంగా కనిపించిన కుర్రాడు ఇప్పుడిప్పుడే హైలెట్ అవుతున్నాడు. ఫోటో షూట్లు, యాడ్స్ అంటూ హంగామా చేస్తున్నాడు. లేటెస్ట్ గా స్నూకర్ టోర్నమెంట్ కి స్పెషల్ గెస్ట్ గా వచ్చాడు. ఈ మెగా ప్రిన్స్. జీ స్టార్ రా బ్లేజర్, జరా టీ షర్ట్, జస్పల్ ఫ్యాషన్ జీన్స్,అర్మానీ ఎక్సేంఛ్ వాచ్ వంటి బ్రాండెడ్ వేర్ తో చాలా స్టైలిష్ గా కనిపించాడు వరుణ్ తేజ. ప్రస్తుతం శ్రీనువైట్ల డైరక్షన్ లో మిస్టర్ అనే సినిమా చేస్తున్నాడు. 105 total views, no views today Read More »

పవర్ స్టార్ కూడా స్టార్ట్ చేశాడా

పవర్ స్టార్ కూడా స్టార్ట్ చేశాడా

సాధారణంగా పబ్లిక్ ఫంక్షన్లకు, ప్రైవేట్ కార్యక్రమాలకు చాలా తక్కువగా హాజరయ్యే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ లండన్ పర్యటనకు వెళ్లనున్నారు. ఈ నెల 9న అక్కడ జరగబోయే ‘యునైటెడ్ కింగ్ డమ్ తెలుగు సంఘం’ ఆరవ వార్షికోత్సవ వేడుకల్లో ఆయన పాల్గొననున్నారు. ఈస్ట్ లండన్ లోని ట్రాక్సీ థియేటర్లో ఈ వార్షికోత్సవ వేడుకలు జరగనున్నాయి. సుమారు 2000 లకు పైగా ఎన్నారై కుటుంబాలు ఈ వేడుకల్లో పాల్గొననున్నాయి. పవన్ వేడుకలకు హాజరవుతుండటంతో నిర్వాహకులు ఆయనకు ఘన స్వాగతం పలికేందుకు భారీ ఏర్పాట్లు చేసుకుంటున్నారు. ఈ కార్యక్రమంలో పవన్ కూచిపూడి కళాకారులను, జానపథ కళాకారులను స్వయంగా సత్కరించనున్నారు. దీంతో బయట దేశాల ఫంక్షన్లకు వెళ్ళడం పవర్ స్టార్ కూడా స్టార్ట్ చేశాడా? అని మాట్లాడుకుంటున్నారు టాలీవుడ్ జనాలు. 157 total views, no views today Read More »

టీజర్ తో రికార్డ్స్ అన్నీ బద్ధలు

టీజర్ తో రికార్డ్స్ అన్నీ బద్ధలు

యంగ్ టైగర్ ఎన్టీఆర్ అభిమానులు కొద్దిరోజులుగా ఎంతో ఆసక్తిగా ఎదురుచూసిన ‘జనతా గ్యారెజ్’ సినిమాకు సంబంధించిన ఫస్ట్ టీజర్ రంజాన్ సందర్భంగా జులై సాయంత్రం 6 గంటలకు విడుదల చేసిన విషయం తెలిసిందే. కొరటాల శివతో కలిసి ఎన్టీఆర్ చేసిన ఈ సినిమా మొదట్నుంచే మంచి ఆసక్తి రేకెత్తిస్తూ వస్తోంది. ఇక టీజర్‌తో ఈ సినిమాపై ఉన్న అంచనాలన్నీ తారాస్థాయికి చేరిపోయాయి. దర్శకుడు కొరటాల శివ ఎప్పట్లానే తన బలమైన కథాంశాన్ని, అంతే బలమైన సంభాషణలతో ఓ కథగా చెప్పినట్లు టీజర్ చూస్తే స్పష్టంగా తెలుస్తోంది. అంతా అనుకున్నట్లుగానే అభిమానుల అంచనాలను అందుకున్న ఈ టీజర్ యూట్యూబ్‌లో వ్యూస్ పరంగా దూసుకుపోతోంది. కేవలం ఆరు గంటల్లోనే 1 మిలియన్ వ్యూస్ సాధించిన ఈ టీజర్, తెలుగులో టీజర్స్ విషయంలో ఓ సరికొత్త రికార్డు సృష్టించింది. ఇక టీజర్‌కు వచ్చిన రెస్పాన్స్ తో మరింత ఉత్సాహంతో జనతా గ్యారెజ్ టీమ్ ఆడియో విడుదలకు ... Read More »

‘ధృవ’ స్టార్ ని కలుసుకోండి

‘ధృవ’ స్టార్ ని కలుసుకోండి

సినిమా ప్రారంభం నుంచే ప్రమోషన్ స్టార్ట్ చేస్తే సినిమా రిజల్ట్ ఎలా ఉన్నా కానీ పెట్టిన పెట్టుబడి వచ్చేస్తుందన్న నమ్మకం సినీ నిర్మాతల్లో పెరిగిపోవడంతో ఇప్పుడు అందరూ దాన్నే ఫాలో అవుతున్నారు. ఈ విషయం ఆలస్యంగా తెలుసుకున్న మెగా తనయుడు రామ్ చరణ్ కూడా తన కొత్త సినిమా ధృవ సినిమా కోసం ఇప్పటినుంచే ప్రమోషన్ స్టార్ట్ చేశాడు. మీకు నచ్చిన ఫేవరేట్ చరణ్ డైలాగ్ కు డబ్ స్మాష్ చేసి.. #MyDubForRam అని ట్విట్టర్లో పెడితే. దానిని ‘కొణిదెల ప్రొడక్షన్స్’కు చెందిన టీమ్ వెరిఫై చేసి.. లక్కీ విన్నర్లను ధృవ షూటింగ్ లో చరణ్ తో కలసి ఫోటోలు దిగే ఛాన్సు ని కలగజేస్తుంది. ఈ పోటీని ప్రకటించారో లేదో అప్పుడే ఒక వెయ్యి వరకు డబ్ స్మాష్ వీడియోలు వచ్చేశాయి. ప్రస్తుతం హైదరాబాద్ లో షూటింగ్ జరుపుకుంటోన్న ఈసినిమాను దసరాకి విడుదల చేయాలనుకుంటున్నారు. రకుల్ ప్రీత్ హీరోయిన్ గా ... Read More »

హైస్పీడులో జనతాగ్యారేజ్ బండి

హైస్పీడులో జనతాగ్యారేజ్ బండి

ఒకప్పుడు సినిమా పరిశ్రమలో ఫస్ట్ లుక్, టీజర్లకి అంత ప్రాముఖ్యత ఉండేది కాదు. కానీ ఇప్పుడు బాహుబలి దెబ్బకు సినీజనానికి ఆసక్తి పెరిగింది. ఓ రకంగా చెప్పాలంటే సినిమా రిలీజ్ కి కూడా ఇంత హడావుడి ఉండదేమో అన్న లెవల్లో రిలీజ్ చేస్తున్నారు. ఇటు సినీ ప్రేక్షకులు కూడా ఆదరిస్తుండటంతో ఓ రకంగా సినిమా సక్సెస్ కి ఇవి కీలకంగా మారాయి. ఇప్పుడు యూట్యూబ్ ని మరోసారి షేక్ చేయడానికి వచ్చేశాడు ఎన్టీఆర్ కొరటాల డైరక్షన్‌ లో తెరకెక్కిన జనతాగ్యారేజ్‌ టీజర్ రంజాన్‌ కానుకగా విడుదలైంది.అందుకే బ్యాక్‌ గ్రౌండ్‌ మ్యూజిక్‌ ముస్లిం సోదరులకు అంకితం ఇచ్చేలా ఉంది. ఇలా రిలీజైందో లేదో కానీ పెట్టిన నిమిషంలోనే 15000కి పైగా మంది చూసేశారు. ఎన్టీఆర్‌ గెటప్‌, స్టైల్‌ మరోసారి సూపర్‌ గా ఉండబోతోందని ఈ టీజర్ ని చూస్తేనే తెలుస్తోంది. జనతాగ్యారేజ్‌ ఇక్కడ అన్ని రిపేర్లు చేయబడును అని తారక్‌ చెప్పిన డైలాగ్‌ ... Read More »

బాహుబలి ఔట్.. సరైనోడు ఇన్

బాహుబలి ఔట్.. సరైనోడు ఇన్

బాహుబలి ఔట్ అవ్వడమేంటి.. సరైనోడు ఇన్ అవ్వడమేంటి అంటారా..? అల్లు అర్జున్ ఫ్యాన్స్ ఈ మాటే అంటున్నారు మరి. విజయనగరం జిల్లా టౌన్లో ‘బాహుబలి’ కలెక్షన్ల రికార్డును ‘సరైనోడు’ బద్దలు కొట్టేసిందట. ఈ టౌన్లో ‘సరైనోడు’ 1 కోటి 20 లక్షల 64 వేల 161 రూపాయల గ్రాస్ వసూలు చేసి ‘బాహుబలి’ వసూళ్లను దాటేసిందట. విజయనగర సినీ సామ్రాజ్యం నుంచి ‘బాహుబలి’ ఔట్.. ‘సరైనోడు’ ఇన్ అంటూ ఈ టౌన్ అంతటా బన్నీ ఫ్యాన్స్ ఫ్లెక్సీలు పెట్టి మరీ ప్రచారం చేస్తున్నారు. విజయనగరంతో పాటు శ్రీకాకుళంలోనూ ‘సరైనోడు’ సంచలన రికార్డులు సాధించిందటూ ఈ ఫ్లెక్సీలో పేర్కొన్నారు. ఐతే ఇది అభిమానులు చెబుతున్న లెక్క. అధికారిక కలెక్షన్ల వివరాలు తెలియాల్సి ఉంది. ఉత్తరాంధ్రలో ‘సరైనోడు’ నాన్ బాహుబలి రికార్డుల్ని బద్దలు కొట్టడం వాస్తవం. ఇక్కడ రూ.8 కోట్లకు పైగా గ్రాస్ వసూలు చేసి ‘మగధీర’ పేరిట ఉన్న నాన్-బాహుబలి రికార్డును ఆల్రెడీ ... Read More »

ఇండియాస్ బిగ్గెస్ట్ మూవీ

ఇండియాస్ బిగ్గెస్ట్ మూవీ

‘బాహుబలి’ రెండు భాగాలుగా తెరకెక్కినప్పటికీ.. దాన్ని ఒక సినిమాగానే పరిగణించాలి. ఈ సినిమా బడ్జెట్ రూ.250 కోట్లు. ప్రస్తుతానికి అదే ఇండియాలో అత్యధిక బడ్జెట్ తో తయారైన సినిమా. ఈ రికార్డును బద్దలు కొట్టడానికి శంకర్ సిద్ధమవుతున్నాడు. ఆయన దర్శకత్వంలో తెరకెక్కుతున్న రోబో-2 బడ్జెట్ రూ.350 కోట్లు. బాలీవుడ్డోళ్లే ఇంతవరకు రూ.200 కోట్లు పెట్టి సినిమా తీయలేదు. అలాంటిది సౌత్ సినిమాలో ఈ స్థాయిలో బడ్జెట్లతో సినిమాలు రూపొందించడం ఆశ్చర్యకరమైన విషయం. సౌత్ సినిమా సంచలనాలు ఇంతటితో ఆగట్లేదు. రోబో-2 కంటే ఎక్కువ బడ్జెట్ తో సినిమా తీయడానికి మరో తమిళ దర్శకుడు సుందర్.సి రెడీ అవుతున్నాడు. బడ్జెట్ ఇంత అని చెప్పలేదు కానీ.. తన దర్శకత్వంలో తెండ్రాల్ ఫిలిమ్స్ తీయబోయేదే ఇండియాస్ బిగ్జెస్ట్ మూవీ అని స్పష్టం చేశాడతను. ఇందులో హీరో విజయ్ అని.. సూర్య అని రకరకాల ప్రచారాలు జరుగుతున్నాయి. హీరో సంగతి తేలకున్నా.. టెక్నీషియన్స్ సంగతి మాత్రం ... Read More »

error: Content is protected !!